దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి తెలుసుకునేందుకు 21 జిల్లాలు ఎంపిక

దేశంలో కరోనా కేసులు వేలల్లో పెరిగిపోతున్నాయి.. అయితే రికవరీలు కూడా కాస్త ఎక్కువగానే నమోదు అవుతున్నాయి.

Update: 2020-05-13 03:20 GMT

దేశంలో కరోనా కేసులు వేలల్లో పెరిగిపోతున్నాయి.. అయితే రికవరీలు కూడా కాస్త ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇది ఊరట కలిగించే విషయమే.. అయినా దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ పై ఆందోళన వ్యక్తమవుతోంది.. ఈ తరుణంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి తెలుసుకోవడానికి 21 రాష్ట్రాల్లోని 69 జిల్లాలను ఎంపిక చేసింది కేంద్రం. జనాభా ఆధారిత సర్వే ఇక్కడ జరుగుతుంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, ఈ జిల్లాల్లో కరోనా వైరస్ యొక్క కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ను గుర్తించడానికి పరీక్షలు చేస్తారు. ఈ జిల్లాలోని 10 క్లస్టర్ ప్రాంతంలోని ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తి యొక్క నమూనా తీసుకోబడుతుంది. ఈ సర్వేలో మహారాష్ట్రలోని ఆరు జిల్లాలు - బీడ్, జల్గావ్, అహ్మద్ నగర్ ,సాంగ్లిలను చేర్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో, రాజస్థాన్ నుండి దౌసా, జలూర్ , మధ్యప్రదేశ్ లోని ఇండోర్, గ్వాలియర్ , ఉజ్జయిని కూడా ఉన్నాయి. ఇక యుపిలో బరేలీ, ఉన్నవో, సహారాన్పూర్ , మౌ జిల్లాలు ఉన్నాయి. 


Tags:    

Similar News