చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వాడొద్దు : ఐసీఎంఆర్
ఇకనుంచి చైనా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడొద్దని ఐసీఎంఆర్ సూచించింది.
ఇకనుంచి చైనా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడొద్దని ఐసీఎంఆర్ సూచించింది.చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌లో నాణ్యత లోపించిన కారణంగానే ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇప్పటికే విమానాలలో పలు రాష్ట్రాలు తెప్పించిన ఆయా కిట్లను చైనాకు వెనక్కు పంపించాలని రాష్ట్రాలకు సూచించింది.
ఇదిలావుంటే భారత్ లో కరోనా కేసులు 24 గంటల్లో 1396 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం ధృవీకరించబడిన కేసులు 27,892 గా ఉన్నాయి. అయితే ఇందులో 6184 కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే మొత్తం 872 మంది కరోనా భారిన పడి మరణించారు.
ప్రస్తుతం 20,835 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న ఒక్కరోజే 381 మంది రోగులు కోలుకున్నారని. ప్రస్తుతం రికవరీ రేటు 22.17% గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు రెడ్‌జోన్, హాట్‌స్పాట్‌లు లేని ప్రాంతాల్లో పరిశ్రమలు, దుకాణాలు తెరుచుకోవచ్చని సడలింపులు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.