లోన్ కావాలా... ఐసీఐసీఐ బ్యాంకు అదిరిపోయే ఆఫర్లు త్వరపడండి

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ కస్టమర్ల కోసం మహా లోన్ ధమాకా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది

Update: 2019-11-16 06:18 GMT
Icici Bank Organise Maha Loan Camps

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ కస్టమర్ల కోసం మహా లోన్ ధమాకా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2020 మార్చిలోగా భారత దేశా వ్యాప్తంగా 2వేల క్యాంపులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మహా లోన్ ధమాకా ద్వారా ఖాతాదారులు ఒకే చోట లోనుతోపాటు బ్యాంకు ఆఫర్లు కూడా పొందొచ్చు.

ఐసీఐసీఐ బ్యాంకు నిర్వహిస్తున్న ఈ బ్యాంకు రుణమేళా రెండు రోజులు ఉంటుంది. రుణాగ్రహీతలు అందుకు కావాల్సీన అర్హతకు గల పత్రాలు తీసుకొని వెళ్లాలి. పత్రాలు పరిశీలించిన వెంటనే రుణ సదుపాయం కల్పిస్తారు. మొదట ఈ మహా లోన్ ధమాకా కార్యక్రమాన్ని గుజరాత్ లో ప్రారంభమైంది. రుణసదుపాయాన్ని ద్విచక్రవాహనానికి, కారు, వరికోత విషన్లు, ట్రాక్టర్లులకు కిసాన్ క్రిడెట్ కార్డు లబ్ధిదారులకు లోన్ ముంజూరు చేసుంది. అలాగే లోన్ మేళాలో వ్యత్తిగత లోను ,గృహలకు, అలాగేక్రిడిట్ కార్డులకోసం ధరకాస్తు చేసుకోవచ్చు.

‎గృహ వస్తు, ద్విచక్ర వాహనం, ట్రక్ రుణాలు తీసుకునే వారికి ప్రత్యేక సదుపాయాలు కూడా ఐసీఐసీఐ బ్యాకు కల్పిస్తుంది. లోన్ తీసుకునే వారికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ప్రతి నెల తక్కవ కల్పిస్తుంది. ఇన్‌స్టంట్ లోన్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. పర్సనల్ లోన్, బంగారం, ట్రాక్టర్స్, ఆటో వంటి వాటిపై మాత్రం ప్రాసెసింగ్ ఫీజు రూ.999 నుంచి రూ.2,000 వరకూ ఉంటుంది. బంగారంపై తీసుకునే లోన్స్‌పై (రూ.2 లక్షల పైన) 50 శాతం ప్రాసెసింగ్ ఫీజును తగ్గిస్తుంది. రుణాలు తీసుకున్న వారు క్వీజ్‌లో పాల్గొనవచ్చు. గెలుపొందిన టాప్ 100 విజేతలు ఐసీసీఐ బ్యాంకు బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడు నటుడు షారూక్ ఖాన్‌ను కలిసే అవకాశం కల్పిస్తుంది. రుణం తీసుకుంటే ఒక సంవత్సరం పాటు gaana.com, sony వంటి యాప్ లైవ్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. కొన్ని కంపెనీల కార్లపై పత్యేక ఆఫర్లు ప్రటించింది.  


Keywords : Icici Bank, Organise Loan Camps, Big Benefits , India

Tags:    

Similar News