నా మనవడిని చూసి కన్నీళ్లు ఆగడం లేదు : ఆనంద్ మహీంద్రా భావోద్వేగ ట్వీట్

నా మనవడిని చూసి కన్నీళ్లు ఆగడం లేదు : ఆనంద్ మహీంద్రా భావోద్వేగ ట్వీట్

Update: 2019-09-25 04:51 GMT

ఆనంద్ మహీంద్ర... పరిచయం అక్కర్లేని పేరు. ప్రఖ్యాత మహాంద్రా గ్రూప్ అధిపతి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడూ సరదా ట్వీట్లతో నవ్వులు పూయించే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. చేతుల్లేని ఓ చిన్నారి.. కాళ్లతో ఫోర్కు పట్టుకుని ఆహారం తినడానికి ప్రయత్నిస్తున్న ఆ చిన్నారి వీడియో ఆయనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. దీంతో ఆయన ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'నా మనవడి వీడియోను ఇటీవలే చూశాను. కానీ, వాట్సాప్‌లోని ఈ వీడియోను చూసి నా కళ్లల్లో నీళ్లు ఎందుకు ఆపుకోలేకపోయానో తెలియడం లేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురవుతాయి. వాటిని మనం బహుమతిగా భావించి.. అనుకూలంగా మలచుకోవడమే ముఖ్యం. ఇలాంటివి చూస్తున్నప్పుడు నాలో ధైర్యం రెట్టింపు అవుతుంది' అని ట్వీట్ చేశాడు. దాంతో నెటిజన్లు ఆయన ట్వీట్ చూసి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడికి ఎంత కష్టం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News