భార్య ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుందని... భర్త దారుణం..
భార్య ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటుందని విసుగుపోయి భర్త హతమార్చాడు. ఇటీవల ఆమెకు తన భర్తే ఫోన్ కొనిచ్చాడు.
భార్య ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుందని... భర్త దారుణం..
భార్య ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటుందని విసుగుపోయి భర్త హతమార్చాడు. ఇటీవల ఆమెకు తన భర్తే ఫోన్ కొనిచ్చాడు. అయితే నిత్యం ఆమె ఫోన్‌లో ఉంటుంది. ఇంటి పనులు కూడా పట్టించుకోకుండా ఫోన్‌లో ఉండటంతో తన భర్త విసిగిపోయాడు. వివరాల్లోకి వెళితే...
ఈ ఘటన ఉడుపి జిల్లా బ్రహ్మావరలో ఉన్న హిలియాణ గ్రామంలో జరిగింది. రేఖ, గణేశ్ దంపతులు కొంతకాలంగా ఆ ఊరిలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల రేఖకు గణేశ్ సెల్ ఫోన్ కొనిచ్చాడు. అయితే అప్పటి నుంచి రేఖ తన బంధువుల, స్నేహితులతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. అయితే గణేశ్ ఆమె ఫోన్ లో మట్లాడుతున్న ప్రతిసారీ గొడవ చేసేవాడు. గురువారం మధ్యం మత్తులో ఇంటికి వచ్చిన గణేశ్ భార్య ఫోన్ మాట్లాడుతుండడంతో విసిగిపోయాడు. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గడువు జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న కత్తితో రేఖ పొట్టలో పొడిచాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. అక్కడికక్కడే రేఖ మరణించింది. పోలీసులు గణేశ్‌ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
అయితే విచారణలో గణేశ్, భార్యకు ఫోన్ కొని ఇచ్చిందని తానేనని, అయితే అమెకు నిత్యం ఎవరోఒకరితో మాట్లాడుతూ ఉంటుందని, ఇంట్లో సరిగా పనులు కూడా చేయడం మానేసిందని, దీంతో తాను విసిగిపోయాయని అందుకే కోపంతో ఆమెను పొడిచానని చెప్పాడు.