పండగవేళ.. వంటగ్యాస్ బాదుడు!

నెలకోసారి ఎల్పీజీ ధరలను సవరించడం జరుగుతూ వస్తోంది. పోయిన నెలలో తగ్గిన ఎల్పీజీ ధరలు ఇప్పుడు పెరిగాయి. పెరిగిన ధరలు ఈరోజునుంచే అమలులోకి వస్తాయి.

Update: 2019-09-01 15:29 GMT

వంటింటికి షాక్. ఎల్పీజీ ధర పెరిగింది. నెల రోజుల క్రితం దిగివచ్చిన ఎల్పీజీ ధరలు మళ్ళీ పెరిగాయి. దిల్లీలో తాజాగా వంట గ్యాస్ ధర 15.5 రూపాయలు పెరిగినట్టు ప్రభుత్వరంగ ఇంధన రిటైల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం 574.50 రూపాయలు ఉన్న గ్యాస్ సిలెండర్ ధర 590 రూపాయలకు చేరింది. కోల్కతాలో ఈ ధర రూ 616.50 కాగా, ముంబాయిలో సిలెండర్ ధర 562, చెన్నైలో 606.50 రూపాయలకు చేరింది.

డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గడం, ఇన్పుట్ టాక్స్ పెరగడం వలన ఈ ధర పెంపు తప్పలేదని చమురు కంపెనీలు చెప్పాయి. పెరిగిన ఈ రేట్లు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి.


Tags:    

Similar News