Honeymoon couple: మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్..భార్యే అసలు కుట్రదారు..!

Honeymoon couple: మేఘాలయలో ఇండోర్ జంట మిస్సింగ్ లో కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

Update: 2025-06-09 02:55 GMT

Honeymoon couple: మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్..భార్యే అసలు కుట్రదారు..!

Honeymoon couple: మేఘాలయలో ఇండోర్ జంట మిస్సింగ్ లో కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. హనీమూన్ కు వెళ్లి రఘువంశీ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో రాజా రఘువంశీ భార్య సోనమ్ తో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోనమ్ కనిపించకపోవడంతో తీవ్రంగా గాలించిన పోలీసులు చివరికి ఆమెను అరెస్ట్ చేశారు. సోనమ్ తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడింది. ఆమె తండ్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. సోనమ్ లొంగిపోయిన తర్వాత, రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీని ఇప్పుడు ఛేదించడానికి పోలీసులు ఇప్పుడు ఆమెను విచారిస్తున్నారు.

రాజా రఘువంశీ, సోనమ్ మే 11న ఇండోర్‌లో వివాహం చేసుకున్నారని, వివాహం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత, మే 20న, నూతన వధూవరులు తమ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఇండోర్ జంట అదృశ్యం కేసుపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ట్వీట్ చేస్తూ, "రాజా హత్య కేసులో మేఘాలయ పోలీసులు 7 రోజుల్లోనే పెద్ద పురోగతి సాధించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 3 మంది దుండగులను అరెస్టు చేశారు. ఒక మహిళ లొంగిపోయింది. మరొక దుండగుడిని పట్టుకోవడానికి ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది" అని అన్నారు.


ఈ హత్య కేసులో భార్యతో సహా నలుగురిని అరెస్టు చేశారు. భర్త రాజా రఘువంశీ హత్యలో భార్య ప్రమేయం ఉందని, ఆమె కిరాయి హంతకులను నియమించుకుందని డీజీపీ తెలిపారు. నందగంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ధాబా వద్ద సోనమ్ కనిపించాడు. ఆ తర్వాత నందగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సోనమ్‌ను జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత ఆమెను వన్ స్టాప్ సెంటర్‌లో ఉంచారు. సోనమ్ వీడియో కాలింగ్ ద్వారా తన కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఇప్పుడు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించవచ్చు.

Tags:    

Similar News