సోమవారం బ్యాంకులకు సెలవు?

Update: 2019-03-30 01:58 GMT

మార్చి 31వ అంటే ఈ ఆదివారంతో ప్రస్తుత (2018–19) ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. దీంతో యాన్యువల్‌ క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ ఈ ఆదివారంతో ముగుస్తాయి. ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లకు అలాగే జీతబత్యాల చెల్లింపుల లావాదేవీల నిర్వహణకు సంబంధిత ప్రత్యేక బ్యాంక్‌ బ్రాంచీలు పనిచేయనున్నాయి. 'పే అండ్‌ అకౌంట్‌ బ్యాంక్‌ బ్రాంచీలు అన్నీ మార్చి 31న పనిచేయలని' ఆర్బీఐ సూచించింది. ఆర్‌టీజీఎస్, నిఫ్ట్‌ వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ లావాదేవీ సమయాలు పొడిగించాలని పేర్కొంది. మరోవైపు ఈ ఆదివారం వర్కింగ్ డే కారణంగా దేశంలోని అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులు సోమవారం పనిచేసే అవకాశం ఉండకపోవచ్చని వినియోగదారులు భావిస్తున్నారు.

Similar News