ONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం

ONGC Helicopter Crash: సముద్రంలో పడిపోయిన హెలికాప్టర్‌, నలుగురు మృతి.. ఐదుగురు సురక్షితం

Update: 2022-06-29 01:29 GMT

ONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం

ONGC Helicopter Crash: ONGC కి చెందిన ఓ హెలికాప్టర్‌ అరేబియా సముద్రం మీదుగా వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 9మంది ఉండగా.. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ONGC ఉద్యోగులు ఉన్నారు. మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

అరేబియా సముద్రంలోని ఓ రిగ్‌కు సమీపంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనతో రంగంలోకి దిగిన ONGC, నేవీ బృందాలు.. రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి తొమ్మిది మందిని బయటకు తీసుకువచ్చారు. ఆస్పత్రికి తరలించగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags:    

Similar News