వడోదరను వణికించిన వరుణుడు..

Update: 2019-08-02 06:00 GMT

గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు.. గుజరాత్‌లోని వడోదర నగరం పూర్తిగా మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోగా, నివాస ప్రాంతాల్లోకి వరద నీరు నిలిచిపోయింది. వేలాదిగా వీధులన్నీ వరద నీటిలోనే నానుతున్నాయి. ఇళ్లముందు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నీళ్లు నిలిచిపోవడంతో.. పై అంతస్థుల్లో ఉండాల్సి వస్తోంది. చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చాలా వాహనాలు నీళ్లలోనే మునిగిపోయాయి. బుధవారం రాత్రి బజ్వా ప్రాంతంలో ఓ ప్రాంతంలో గోడ కూలి నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా వడోదరలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నీట మునిగిన నగరానికి రోడ్డు, రైలు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కాగా వడోదరకు వర్షపు ముప్పు ఇంకా తొలగిపోలేదని వాతావరణ శాఖ చెబుతోంది. వడోదర నగరంతో పాటుగా వల్సాద్, బహరుచ్, నవసారి, బానసకాంత, పటాన్ జిల్లాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News