Rajasthan: రాజస్థాన్ ను ముంచెత్తిన వరదలు.. ఇళ్లల్లోకి చేరుతున్న వరద నీరు
Rajasthan: వరదల్లో చిక్కుకుని ఏడుగురి మృతి
Rajasthan: రాజస్థాన్ ను ముంచెత్తిన వరదలు.. ఇళ్లల్లోకి చేరుతున్న వరద నీరు
Rajasthan: బిపోర్‌జాయ్ తుపాను అనంతరం ఏర్పడిన వాయుగుండం కారణంగా రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లోనే వర్షాల కారణంగా ఏడుగురు మరణించారు. వరదల్లో చిక్కుకున్న 265 మందిని సహాయక దళాలు రక్షించాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 15 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వర్ష ప్రభావిత బాడ్‌మేర్, సిరోహి, జలోర్ జిల్లాల్లో ఈ రోజు పర్యటించనున్నారు.