Sikkim: సిక్కింలో భారీ వర్షాలు.. పలు చోట్ల రోడ్లు బ్లాక్.. ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకులు

Sikkim: 300 మందిని రక్షించిన సైన్యం

Update: 2023-06-18 13:39 GMT

Sikkim: సిక్కింలో భారీ వర్షాలు.. పలు చోట్ల రోడ్లు బ్లాక్.. ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకులు 

Sikkim: సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర సిక్కింలోని చుంగ్‌తాంగ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్లు బ్లాక్‌ అయ్యాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది. రెస్క్యూ సమయంలో భారత ఆర్మీ దళాలు పర్యాటకులకు ఆహారం అందించారు. అవసరమైన వారికి వైద్య సదుపాయాన్నికల్పించామని PRO డిఫెన్స్ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్, PRO డిఫెన్స్ తెలిపారు.

Tags:    

Similar News