Delhi: దిల్లీలో మళ్లీ తీవ్ర వాయుకాలుష్యం

Delhi: పొగమంచుతో దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసుల రద్దు

Update: 2024-01-15 02:32 GMT

Delhi: దిల్లీలో మళ్లీ తీవ్ర వాయుకాలుష్యం

Delhi: ఉత్తరభారతాన్ని పొగమంచు కప్పేసింది. రోడ్డుపై వాహనాలు కనపడనంతాగా పొగమంచు చేరటంతో.. వాహనం నడపలేని పరిస్థితి నెలకొంది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించనంతగా పొగమంచు చేరంది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో రెండు అంతర్జాతీయ విమానాలు సహా 10 విమానాలను ఉదయం 4.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జైపుర్‌కు దారి మళ్లించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణం కారణంగా విదేశీ విమానాలతో సహా దాదాపు 100 విమానాలు ఆలస్యమైనట్లు తెలిపారు.

దిల్లీ చేరుకోవాల్సిన 22 రైళ్లపైనా పొగమంచు ప్రభావం చూపింది. పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తర రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో దట్టమైన పొగమంచు తెర అలముకున్నట్లు భారత వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు.. ఢిల్లీలో వాయుకాలుష్యం మళ్లీ కోరలు చాస్తోంది. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు, స్థానికంగా పెరుగుతున్న కాలుష్యంతో శనివారం ఉదయం 11 గంటలకు వాయునాణ్యత సూచీ 457కు చేరింది. దీంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో అన్ని రకాల నిర్మాణాలు, బీఎస్‌-3, 4 పరిధిలోని వాహనాల వినియోగంపై నిషేధాన్ని విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

Tags:    

Similar News