Hemant Soren: హేమంత్ సోరెన్ బెయిల్ పిటీష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ

Hemant Soren: వాద‌న‌ల‌ను మే 22కి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

Update: 2024-05-21 16:15 GMT

Hemant Soren: హేమంత్ సోరెన్ బెయిల్ పిటీష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ 

Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటీష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ కేసులో వాద‌న‌ల‌ను మే 22కి వాయిదా వేశారు. సోరెన్ ప్రభుత్వ హ‌యాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్రమ లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచార‌ణ చేప‌డుతుంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న‌కు బెయిల్ మంజూరీ చేయాల‌ని సోరెన్ కోరారు. దీని కోసం ఆయ‌న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసును ఉదాహ‌ర‌ణ‌గా చూపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్‌.. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బెయిల్ తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆయ‌న ఆప్ త‌ర‌పున ప్రచారం నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News