Supreme Court: సీఈసీ, ఈసీల నియామకంపై కేంద్రం తెచ్చిన కొత్తచట్టంపై సుప్రీంలో విచారణ

Supreme Court: సీఈసీ, ఈసీల నియామక ప్యానెల్‌ నుంచి చీఫ్ జస్టిస్‌ను తొలగిస్తూ కేంద్రం కొత్తచట్టం

Update: 2024-03-15 04:00 GMT

Supreme Court: సీఈసీ, ఈసీల నియామకంపై కేంద్రం తెచ్చిన కొత్తచట్టంపై సుప్రీంలో విచారణ 

Supreme Court: సీఈసీ, ఈసీల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుంది. సీఈసీ, ఈసీ నియామకం కోసం ఉద్దేశించి ప్యానెల్‌ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తప్పించింది. ఈ మేరకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును ఏడీఆర్‌‌ విజ్ఞప్తి చేసింది. ‘చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఆదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ యాక్ట్‌– 2023’లోని సెక్షన్‌ 7 అమలుపై స్టే విధించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. నేడు విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

Tags:    

Similar News