Coronavirus: ప్రస్తుతానికి భారత్ కు ఊరట కలిగించేది ఇదే..

భారత్ లో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది.. ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 21,494 కు పెరిగింది.

Update: 2020-04-23 11:46 GMT
Representational Image

భారత్ లో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది.. ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 21,494 కు పెరిగింది. అయితే ఊరట కలిగించే వార్త ఏమిటంటే ఇందులో 4257 మందికి నయం కావడమే.. ప్రస్తుతం 16454 మందికి చికిత్స కొనసాగుతోంది. అయితే భారతదేశంలో రికవరీ రేటు 19.89 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో మొత్తం 4,257 మంది డిశ్చార్జ్ కాగా అత్యధికంగా మహారాష్ట్రలో 789 మంది కోలుకున్నారు. అయితే ఇక్కడ కేసులు 5 వేలు దాటాయి. ఆ తరువాత ఢిల్లీలో 724 , తమిళనాడు 662, కేరళ 323 మంది డిశ్చార్జ్ అయ్యారు.. కేరళలో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే కోవిడ్ భారిన పడిన మొత్తం 438 మందిలో 323 మంది కోలుకున్నారు, అంతేకాదు ఇక్కడ కేవలం మూడు మరణాలు మాత్రమే సంభవించాయి.

ఇక ఆ తరువాత రాజస్థాన్ లో 230 , తెలంగాణలో 194 , గుజరాత్ 179 , ఉత్తరప్రదేశ్ 173 , మధ్యప్రదేశ్ 148 , హర్యానా 140 , కర్ణాటక 131 , ఆంధ్రప్రదేశ్ 120 , జమ్మూ కాశ్మీర్ 92 , పశ్చిమబెంగాల్ 79 , పంజాబ్ 49 , బీహార్ 46 , ఒడిశా 32 , ఛత్తీస్ ఘడ్ 26 , ఉత్తరాఖండ్ 23 , అస్సాం 19 , హిమాచల్ ప్రదేశ్ 18 , చండీగర్, లడక్ 14 , అండమాన్ నికోబార్ దీవులు 11 , జార్ఖండ్ 8 , గోవా 7 ఇక మిగిలిన ప్రాంతాల్లో ఒకటి రెండు రికవరీలు నమోదయ్యాయి. కాగా గురువారం, రాజస్థాన్‌లో 33, పశ్చిమ బెంగాల్‌లో 33, కర్ణాటకలో 16, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, అస్సాంలో ఒక రోగి నివేదికలో పాజిటివ్ అని వచ్చింది.


Tags:    

Similar News