చైనా ర్యాపిడ్ కిట్ల ఆర్డర్ ను రద్దు చేసిన హర్యానా ప్రభుత్వం

ర్యాపిడ్ టెస్ట్ ల విషయంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2020-04-22 11:59 GMT
Haryana health minister anil vij

ర్యాపిడ్ టెస్ట్ ల విషయంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.చైనా నుండి ఆర్డరు చేసిన 1 లక్ష కరోనా రాపిడ్ టెస్ట్ కిట్ ఆర్డర్‌ను రద్దు చేసింది. చైనాకు చెందిన రెండు కంపెనీల ఆర్డర్‌లను రద్దు చేసి దక్షిణ కొరియా కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. గురుగ్రామ్‌లోని మనేసర్‌లో దక్షిణ కొరియా సంస్థ ఈ కిట్‌లను ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీ నుంచే కొత్త కిట్ లను కొనుగోలు చేస్తున్నట్టు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ స్వయంగా ధృవీకరించారు.

అనిల్ విజ్ మాట్లాడుతూ.. దక్షిణ కొరియా కంపెనీ నుండి సగం ధరతో, మంచి నాణ్యతతో ర్యాపిడ్ కిట్ లను తీసుకుంటున్నాం అని వెల్లడించారు. కాగా చైనా నుండి సేకరించిన వేగవంతమైన యాంటీబాడీ పరీక్షల కిట్ లను రెండు రోజుల పాటు ఆపివేయాలని ఐసిఎంఆర్ మంగళవారం కోరిన సంగతి తెలిసిందే. ఇక హర్యానాలో 245 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు.


Tags:    

Similar News