Rahul Gandhi: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు చుక్కెదురు
Rahul Gandhi: స్టే ఇచ్చేందుకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు
Rahul Gandhi: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు చుక్కెదురు
Rahul Gandhi: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురయింది. ఈ కేసుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. కింది కోర్టు తీర్పులను హైకోర్టు సమర్ధించింది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. దొంగలందరి ఇంటిపేరు మోడీయే ఎందుకంటూ.. ప్రశ్నించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తంచేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావావేశారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తన వాదనను వినిపించారు. అయితే పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.