అవార్డులు వద్దు పర్యావరణాన్ని పరిరక్షించండి చాలు

పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన గ్రెటా థంబర్గ్‌ను ప్రతిష్టాత్మక "ఎన్విరాన్ మెంటల్" అవార్డు ఆమెను వరించింది

Update: 2019-10-30 05:46 GMT

పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన గ్రెటా థంబర్గ్‌ను ప్రతిష్టాత్మక "ఎన్విరాన్ మెంటల్" అవార్డు ఆమెను వరించింది. స్వీడన్‌, నార్వే గ్రెటా థంబర్గ్‌ను పేరును అవార్డుకు ప్రతిపాదించాయి. 84దేశాలు సభ్యులుగా ఉన్న నోర్డియాక్ కౌన్సిల్ "ఎన్విరాన్ మెంటల్" అవార్డును తిరస్కరించారు. తనకు ఎలాంటి అవార్డులు అక్కర్లేదని పర్యావరణంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలని ఆమె పేర్కొన్నారు. వాతావరణ మార్పుపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి, రాజకీయ నాయకులు సహాకారం కూడా కావాలన్నారు. సైన్స్‌ చెబుతున్న వాస్తవాలు అందరూ గ్రహించాలి అని గ్రెటా థంబర్గ్‌ విఙ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం గ్రెటా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నార్వే, స్వీడన్‌, ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, డెన్మార్క్ దేశాలు పర్యావరణంపై వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. పర్యావరణానికి నాయకులు హాని చేస్తున్నారని విమర్శించారు. నా బాల్యాన్నీ దొంగిలించారని గ్రెటా ఆరోపించారు . 16 ఏళ్ల గ్రెటా థంబర్గ్‌ అస్‌పెర్జర్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారు. వాతావరణ మార్పులపై శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గత సంవత్సరం ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్‌24 సదస్సులో గ్రెటా అద్భుతంగా ప్రసంగించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News