టీవీల ధరలు తగ్గుతాయి..

టీవీల ధరలు తగ్గుతాయి.. టీవీల ధరలు తగ్గుతాయి.. టీవీల ధరలు తగ్గుతాయి..

Update: 2019-09-19 03:21 GMT

టీవీ కోణాలుకుంటున్నారా అయితే ఇప్పుడు కొనుగోలు చేయండి.. ఎందుకంటే ధరలు దిగొస్తాయి కాబట్టి.. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు బుధవారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇండియాలో తయారయ్యే ఎల్ఈడీ, ఎల్సీడి టీవీ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. వీటిపై ప్రస్తుతం 5 శాతం సుంకాన్ని విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం..

తాజాగా దీనిని పూర్తిగా రద్దు చేసింది. వీటితోపాటు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు(pcb), ఫిల్మ్ చిప్ లపై కూడా దిగుమతి సుంకాన్ని రద్దు చేశారు. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లను ఎల్ఈడీ, ఎల్సీడి టీవీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. టీవీ తయారీకి సగం ఖర్చు దీనిపైనే ఎక్కువగా ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎల్ఈడీ, ఎల్సీడి టీవీల తయారీ ఖర్చు తగ్గనుంది. 

Tags:    

Similar News