మర్కజ్ నుంచి వారిని ఖాళీ చేయించాం
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజు 193 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజు 193 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి 52 మంది మరణించారు. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. ఏపీలో 87 కేసలు నమోదైతే , తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగాయి.
ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ సమావేశాలకు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకడంతో వారి వివరాలు సేకరించేపనిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిమగ్నం అయ్యయి. ఈ నేపథ్యంలో కరోనా ఉత్పాతానికి కేంద్రమైన మసీదు నుంచి మొత్తం 2361 మందిని బయటకు పంపినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1830 మంది మార్చి 15-17 తేదీల్లో మర్కజ్‌ను సందర్శించినట్టు ఢి ల్లీ అధికారులు గుర్తించారు.
తబ్లీగీ జమాత్‌కు హాజరైన కనీసం 3,200 మందిని గుర్తించేందుకు 11 రాష్ట్ర ప్ర్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అహోరాత్రాలు కృషి చేస్తున్నాయి. నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్నవారిని ఈ తెల్లవారుజామున 4 గంటలకు బయటకు తెచ్చామని మనీశ్ తెలిపారు. ఎందరో వైద్య సిబ్బంది, పోలీసులు, డీటీసీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా ఒడ్డి ఈ ఆపరేషన్ పూర్తి చేశారని సిసోడియా తెలిపారు. మార్చి 19న రిజిస్టర్ చేసుకోనివారు ఎందరో మర్కజ్‌ను సందర్శించారని పలు రాష్ట్రలు అంటున్నాయి.