త్వరలోనే శుభవార్త వింటారు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 17 రోజులు గడుస్తున్న అక్కడ ఇంకా ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి రాలేదు.

Update: 2019-11-05 15:43 GMT
Bjp Shiv Sena

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 17 రోజులు గడుస్తున్న అక్కడ ఇంకా ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - శివసేన కలిసి పోటీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే పొత్తుల విషయంలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదలేదు. శివసేన ప్రతిపాదించిన ఫిఫ్టీ - ఫిఫ్టీ ఫార్ములాకి బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రతిష‌్టంభన కొనసాగింది. సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ గవర్నర్ తో భేటీ, పవర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ కావడంతో ఆసక్తికరంగా మారింది.

తాజాగా మంగళవారం బీజేపీ సీనియర్‌ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటులో శివసేనతో చర్చలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బీజేపీ మంత్రి సుధీర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుపై శుభవార్త వింటారని వ్యాఖ్యానించారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు అభ్యంతరం లేదన్నారు. సీఎం అభ్యర్ధి బీజేపీ వారేనని పేర్కొన్నారు.

ఈ నెల 8లోగా ప్రభుత్వ ఏర్పాటు చేయకపోతే అక్కడ గవర్నర్ పాలన విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శివసేనతో బీజేపీ మరోసారి చర్చలు జరపాలని యోచిస్తోంది. శివసేన ఎంపీ మాత్రం శరద్ పవర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

Tags:    

Similar News