అలాంటి వారి కోసం ప్రార్థించండి

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమదకర స్థాయికి చేరింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొటున్నారు.

Update: 2019-11-04 09:32 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమదకర స్థాయికి చేరింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొటున్నారు. తాజాగా దీనినిపై స్పందించారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. కాలుష్యం కారణంగా సినిమాల షూటింగ్‌లో పాల్గొనడం కష్టంగా ఉందని ఆమె అన్నారు. ప్రియాంక, ప్రముఖ నటుడు రాజ్‌కుమార్‌ కలిసి నటిస్తున్నకొత్త సినిమా ది వైట్‌ టైగర్‌ షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న ప్రియాంక మాస్క్‌, ఐగ్లాస్, ధరించి సెట్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉంటున్న నగర వాసులకు పరిస్థితి తలచుకుంటే చాలా భయంగా ఉంది. పొల్యూషన్ నుంచి రక్షించుకోవడానికి మాస్క ధరించాను, కానీ ఇక్కడ ఇల్లులేని నిరాశ్రయులు అనేక మంది కష్టాలు అనుభవిస్తున్నారు. అలాంటి వారికి కోసం భగవంతుడిని ప్రార్ధించండి అని ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. 2008లో అరవింద్ అడిగా రచించిన నవల దివైట్ టైగర్ ఆధారంగా చేసుకోని నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్‌ లోని కొన్ని అంశాల చిత్రికరణ ఢిల్లీలో ప్రారంభమైంది. 



Tags:    

Similar News