కశ్మీర్ విభజన అనే దాన్ని నేను కలలో కూడా ఊహించలేదు: ఆజాద్

Update: 2019-08-06 02:36 GMT

జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసింది. రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం కీలక ప్రకటన చేశారు. అమిత్ షా ప్రకటన వెలువడిని నిమిషాల్లో రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారు. కశ్మీరీలకు స్వయంప్రతిపత్తి, ప్రత్యేక హక్కులను కల్పిస్తోన్న ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు కేంద్రం పార్లమెంటులో సంచలన ప్రకటన చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతోన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయినట్టుయ్యింది. అలాగే జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించింది. జమ్మూ కశ్మీర్‌కు అసెంబ్లీతోపాటు కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్‌ను ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ ప్రతిపాదనలు రూపొందించింది.

చట్ట సభలేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను గుర్తించింది. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. కశ్మీర్ విభజన అనే దాన్ని నేను కలలో కూడా ఊహించలేదని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయం నెత్తిన బాంబు వేసినట్టు అనిపించిందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షా నిర్ణయంతో కశ్మీర్ పై అణుబాంబు వేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆర్టికల్‌ 370ను రద్దుచేయడంతో ప్రత్యేక అధికారాలు, హక్కులు కశ్మీరీలు కోల్పోనున్నారు. పార్లమెంటులో చేసిన ప్రతిచట్టం కశ్మీరీలకు వర్తిస్తుంది

Tags:    

Similar News