వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం

Update: 2019-08-25 11:53 GMT

కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. వీజీ సిద్ధార్థ తండ్రి గంగయ్య హెగ్దే(96) మృతిచెందారు. గత కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన మైసూరులోని ఓ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సమయంలో గంగయ్య హెగ్దే కోమాలో ఉన్నారు. కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంగతి ఆయనకు తెలియదు. సిద్ధార్థ ఆత్మహత్యకు మూడు రోజుల ముందు తన తండ్రిని చూసి వచ్చాడు. 

Tags:    

Similar News