గాంధీ ప్రమాదంలో చనిపోయారు.. ఒడిశా విద్యా శాఖ బుక్‌లెట్‌

Update: 2019-11-16 09:23 GMT
Mahatma Gandhi

మహాత్మా గాంధీ జయంతోత్సవాల నేపథ్యంలో ఒడిశా విద్యా శాఖ ముద్రించిన ఓ బుక్‌లెట్ తీవ్ర వివాదాస్పదమైంది. గాంధీజీ ప్రమాదంలో చనిపోయారంటూ ఒడిశా విద్యాశాఖ ప్రచురించింది. దీనిపై రాష్ట్రంలో రాజకీయ నేతలు, ఉద్యమ సంఘలా నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీఎం నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

గాంధీజీ 150వ జయంతోత్సవాల ఆమా బాపూజీ ఏక్ ఝలకా -మన ఒక సంగ్రహ అవలోకనం పేరిట ఓ బుక్ లెట్ ప్రచురితమైంది. గాంధీకి సంబంధించిన విషయాలు రెండు పేజీలు ఉన్న ఆ బుక్‌లెట్‌లో వివరించారు. 1948 సంవత్సవరం జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో ప్రమాదం గాంధీజీ చనిపోయినట్లు ఉంది. దీని ప్రతిప‌క్షలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని రంజన్ దాస్ తెలిపారు.

Tags:    

Similar News