FasTag: వాహనదారులకు తీపికబురు

FasTag: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. ఫాస్టాగ్ ను ఉచితంగానే అందిస్తున్నట్లు ‍‌NHAI వెల్లడించింది.

Update: 2021-02-21 14:01 GMT

ఫాస్టాగ్ (ఫోటో హన్స్ ఇండియా )

Free FasTag: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. ఫాస్టాగ్ ను ఉచితంగానే అందిస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2021 మార్చి 1 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 770 టోల్ ప్లాజాలలో (స్టేట్ ప్లాజాతో సహా) వాహనదారులు ఉచితంగానే ఫాస్టాగ్ పొందవచ్చు అని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. దీంతో ఫాస్టాగ్ రిజిస్ర్టేషన్ కు అయ్యే ఖర్చు రూ.100 ఆదా కానుంది. నేషనల హవైలపై నడిచే వాహనాల యూజర్లు ఫాస్టాగ్ వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం, ఫాస్టాగ్ ను 87 శాతం మంది వినియోగదారులు వాడుతున్నట్లు తెలిపింది. కేవలం రెండు రోజుల్లోనే ఫాస్టాగ్ వినియోగం 7 శాతం పెరిగిందని వెల్లడించింది. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా సాంకేతిక లోపం ఉంటే.. ఫాస్టాగ్‌లలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా వాహనదారులు టోల్ ప్లాజాలు దాటవచ్చు అని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొన్నారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్ల అమ్మకాలు జరిగాయని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. ప్రతి వాహనదారుడి దగ్గర ఫాస్టాగ్ తప్పక ఉండాల్సిందేనని.. లేదంటే భారీ జరిమానా పడుతుందని హెచ్చరించింది.

Tags:    

Similar News