కీలక నిర‌్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర‌్ణయం తీసుకుంది. అక్కడ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2019-10-29 06:29 GMT

ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర‌్ణయం తీసుకుంది. అక్కడ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రాంభించిన విషయం తెలిసిందే. డీటీసీ బస్సుల్లో సింగిల్ జర్నీ బస్సు పాసుల ద్వారా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఢిల్లీ ప్రభుత్వం కల్పింస్తుంది. మంగళవారం నుంచి మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది.మహిళల భద్రత 13 వేల మంది మార్షల్స్ ను కూడా బస్సుల్లో ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వం తీసుకున్న నిర‌్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలువురు మహిళలలు స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు చాలా మంచి విషయమని, కానీ ఈ నిర్ణయం వలన ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని శాంతి అనే మహిళ పేర్కొంది. ఇక టికెట్ కొనలేని పరిస్థితిలో ఉచిత ప్రయాణ తమకు బాసటగా నిలుస్తుందని శ్వేత అనే మహిళ తెలిపింది. బస్సులు సరైన సమయానికి వస్తే ప్రభుత్వ నిర్ణయం తమకు ఉపయోగకరంగా ఉంటుందని మరో మహిళ తెలిపింది. 

Tags:    

Similar News