క్వారంటైన్‌లో న‌లుగురు క‌ర్ణాట‌క మంత్రులు

ఓ జ‌ర్న‌లిస్టుకు క‌రోనా సోక‌డంతో అత‌న్ని క‌లిసిన న‌లుగురు మంత్రులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు.

Update: 2020-04-30 11:37 GMT

ఓ జ‌ర్న‌లిస్టుకు క‌రోనా సోక‌డంతో అత‌న్ని క‌లిసిన న‌లుగురు మంత్రులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. ఈ జాబితాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్ ఉన్నారు. ఈ నలుగురూ ట్విట్టర్‌లో తమ దిగ్బంధాన్ని ప్రకటించారు. నారాయణ్, హోంమంత్రి బస్వరాజ్ బొమ్మాయి, వైద్య విద్య మంత్రి డాక్టర్ సుధాకర్ , పర్యాటక శాఖ మంత్రి సిటి రవి ట్వీట్ చేశారు, తమకు కరోనా పరీక్షలు చేయగా.. నెగటివ్ వచ్చిందని.. అయినా కూడా స్వీయ నిర్బంధంలో ఉంటామని చెప్పారు.

ఏప్రిల్ 24న COVID-19 పాజిటివ్‌గా గుర్తించిన స్థానిక టెలివిజన్ ఛానల్‌కు చెందిన వీడియో జర్నలిస్టుతో సంప్రదించినట్లు వారు తెలిపారు. ఏప్రిల్ 21 - 24 మధ్య ఆయన మంత్రులను కలిశారు. దీంతో వీడియో జర్నలిస్ట్, అతని కుటుంబసభ్యులు, వివిధ మీడియా సంస్థల జర్నలిస్టులతో సహా 40 మందిని నిర్బంధించినట్లు వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదించింది.


Tags:    

Similar News