భారత్‌లో మహమ్మారి తొలి ఫొటోలు విడుదల

కరోనా వైరస్ మహమ్మారి కి సంబంధించిన ఫొటోలు భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి.

Update: 2020-03-28 05:31 GMT
coronavirus image

కరోనా వైరస్ మహమ్మారి కి సంబంధించిన ఫొటోలు భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి.ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి పుణెలోని ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐవీ శాస్త్రవేత్తలు కంటికి కనిపించని సూక్ష్మజీవి ఫొటోలను తీశారు.. వీటిని ప్రజలకు చూపించారు. ఇవి ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురించబడ్డాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన సాంపిల్స్‌లోని జన్యుక్రమం... చైనాలోని వుహాన్‌లో బయటపడ్డ సార్స్‌-కోవ్‌-2(కరోనా వైరస్‌) జన్యుక్రమంతో 99.98 శాతం సరిపోలిందని వైద్య నిపుణులు వెల్లడించారు.

భారత్‌లో నమోదైన తొలి కరోనా కేసుకు సంబంధించిన థ్రోట్‌ స్వాబ్‌ ద్వారా వీటిని తీసినట్టు తెలిపారు. కరోనావైరస్ కణానికి విలక్షణమైన రౌండ్ నిర్మాణాలతో ముగిసే కొమ్మ లాంటి ఆకారాన్ని ఇందులో చూడవచ్చు. ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐవీ నేషనల్‌ ఇన్‌ఫ్లూయెంజా సెంటర్‌ టీం''ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపి ఇమేజింగ్‌ ఆఫ్‌ సార్స్‌-కోవ్‌-2''పేరిట ఈ ఆర్టికల్‌ను ప్రచురించింది. రచయితలలో డిప్యూటీ డైరెక్టర్ మరియు ఎన్ఐవి పూణేలో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ మరియు పాథాలజీ హెడ్ అటాను బసు కూడా ఉన్నారు.


Tags:    

Similar News