Coronavirus: అక్కడ తొలి మరణం

ఈశాన్యం రాష్ట్రాల్లో తొలి కరోనా మరణం నమోదైంది, కోవిడ్-19 కారణంగా అస్సాంలో 65 ఏళ్ల వ్యక్తి కన్నుమూశారు.

Update: 2020-04-10 03:43 GMT

ఈశాన్యం రాష్ట్రాల్లో తొలి కరోనా మరణం నమోదైంది, కోవిడ్-19 కారణంగా అస్సాంలో 65 ఏళ్ల వ్యక్తి కన్నుమూశారు.అయనను హైలాకాండి జిల్లాకు ఫైజుల్ హక్ బార్బ్యాన్ (65)గా గుర్తించారు. ఎస్‌ఎంసీహెచ్‌ ఆస్పత్రిలో మరణించినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.

మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మరోవైపు అసోంలో ఇప్పటివరకు 28 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారే ఉన్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

అస్సాం నుంచి మొత్తం 617 మంది ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన జ‌మాత్‌కు హాజరైనట్లు ఆరోగ్య శాఖ అంచనా వేసింది. కాగా, లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత కూడా కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగుతాయని హిమంత బిశ్వాస్‌ శర్మ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం వేరే వారు తమ రాష్ట్రంలోకి రావడానికి పరిమితులు విధిస్తామని.. అలాగే ఇందుకోసం ప‌ర్మిట్ వ్య‌వ‌స్ధ‌ను ప్రారంభించనున్న‌ట్టు ఆయన తెలిపారు.

ఇదిలావుంటే మనదేశంలో ఇప్పటివరకు 5,856 కోవిడ్‌ కేసులు నమోదు కాగా, 169 మరణాలు సంభవించాయి. గురువారం ఒక్కరోజే 591 మంది కోవిడ్‌ బారిన పడ్డారు.. నిన్న ఒక్కరోజే 20 మంది కరోనా భారిన పడి చనిపోయారు.


Tags:    

Similar News