కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..

జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నిన్న రాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి.

Update: 2020-05-14 08:32 GMT

జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నిన్న రాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులు గురువారం ఈ సమాచారం ఇచ్చారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని యమ్రాచ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న తరువాత భద్రతా దళాలు రాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అదే సమయంలో, పెట్రోలింగ్ వాహనంపై పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, ఆ తరువాత ఎన్కౌంటర్ ప్రారంభమైంది. దీని తరువాత, రెండు వైపుల నుండి నిరంతరం కాల్పులు జరిగాయి.

ఇది ఉదయం 8 గంటలకు ముగిసింది. ఈ ప్రాంతానికి అదనపు సైనిక దళాన్ని కూడా పంపినట్లు చెప్పారు. ఇదిలావుంటే వారం క్రితం కాశ్మీర్‌లో భద్రతా దళాలు హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ రియాజ్ నాయకును ఎన్ కౌంటర్ చేశాయి. రెండేళ్లుగా అతను మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి పుల్వామాలోని బెగ్పోరా గ్రామానికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని మట్టుబెట్టింది.


Tags:    

Similar News