గుర్గావ్‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్లోబల్ ఫోయర్ మాల్‌లో చెలరేగిన మంటలు
Gurugram: కమ్ముకున్న దట్టమైన పొగ.. మాల్‌లోనే చిక్కుకున్న కస్టమర్లు..
గుర్గావ్‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్లోబల్ ఫోయర్ మాల్‌లో చెలరేగిన మంటలు
Gurugram: గుర్గావ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. గ్లోబల్ ఫోయర్ మాల్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చాలా మంది మాల్ లోనే చిక్కుకున్నారు. అతి కష్టం మీద కొంత మంది బయట పడ్డారు.. గాయపడ్డ వారిని అధికారులు పలు ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.