సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Update: 2020-05-21 09:26 GMT
Sonia Gandhi (File Photo)

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పిఎం-కేర్ ఫండ్‌కు సంబంధించిన ట్వీట్‌ పై ఈ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో, సోనియా ట్విట్టర్ ఖాతా హ్యాండ్లర్ అని ఉంచారు. మే 11న కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనియాగాంధీ ఒక ప్రకటన చేసిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నించారని ఫిర్యాదుదారు అయిన న్యాయవాది కెవి ప్రవీణ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ట్వీట్‌లో ఏముంది?

ట్వీట్‌లో, 'పిఎం-కేర్స్ ఫండ్ ప్రజల కోసం కాకుండా ప్రధానమంత్రి సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిందని. ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలనే సంకల్పం బిజెపి ప్రభుత్వానికి ఉంటే, వీధుల్లో వలస కూలీలు ఎక్కువసేపు ఉండేవారు కాదు.' అని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు పోలీసులు. 

Tags:    

Similar News