FASTag Bank Change: వాహనదారులకు బిగ్ అలర్ట్ – మీ FASTag బ్యాంక్ మార్చుకోవడం ఇలా, పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!

హైవేలపై ప్రయాణించే వాహనదారులకు ఇది ముఖ్యమైన సమాచారం. టోల్ ప్లాజాలో FASTag లేకపోతే డబుల్ టోల్ చెల్లించాల్సి వస్తుంది. చాలా మంది ఒక బ్యాంక్ నుంచి FASTag ను తొలగించి, కొత్త బ్యాంక్ నుంచి తీసుకోవాలని అనుకుంటారు.

Update: 2025-07-17 13:32 GMT

FASTag Bank Change: వాహనదారులకు బిగ్ అలర్ట్ – మీ FASTag బ్యాంక్ మార్చుకోవడం ఇలా, పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!

హైవేలపై ప్రయాణించే వాహనదారులకు ఇది ముఖ్యమైన సమాచారం. టోల్ ప్లాజాలో FASTag లేకపోతే డబుల్ టోల్ చెల్లించాల్సి వస్తుంది. చాలా మంది ఒక బ్యాంక్ నుంచి FASTag ను తొలగించి, కొత్త బ్యాంక్ నుంచి తీసుకోవాలని అనుకుంటారు. కానీ, FASTag బ్యాంక్ మార్చుకోవడం ఎలా అన్నది చాలామందికి తెలియదు. అసలు ఈ ప్రాసెస్ చాలా సులభం. ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ సులభంగా మార్చుకోవచ్చు.

FASTag అంటే ఏమిటి?

2021 నుంచి దేశంలోని ఫోర్ వీలర్ వాహనాలకు FASTag తప్పనిసరి అయింది. ఇది RFID టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కి లింక్ అయి, బ్యాంక్ జారీ చేసిన వాలెట్‌కి కనెక్ట్ అవుతుంది.

FASTag బ్యాంక్ ఎలా మార్చుకోవాలి?

NPCI యొక్క One Vehicle One FASTag పాలసీ ప్రకారం, మీకు ఒక యాక్టివ్ FASTag ఉంటే, కొత్త బ్యాంక్‌ ద్వారా మరో FASTag తీసుకోవచ్చు.

ఆన్‌లైన్ ప్రాసెస్

మీరు కావాలనుకునే బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయండి.

“Apply for FASTag” లేదా “Buy FASTag” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

వాహనం నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వివరాలు నమోదు చేయండి.

అడ్రస్ కన్ఫార్మ్ చేసి పేమెంట్ పూర్తి చేయండి.

కొత్త FASTag 3–4 రోజుల్లో మీ ఇంటికి వస్తుంది.

RC, వాహన ఫోటో, సైడ్ ఫోటో, FASTag ఫోటోలను అప్‌లోడ్ చేయండి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత 4 గంటల్లో FASTag యాక్టివేట్ అవుతుంది.

ఆఫ్‌లైన్ ప్రాసెస్

సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లేదా FASTag ఏజెంట్‌ను సంప్రదించండి.

ఏజెంట్ మీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి వెరిఫికేషన్ లింక్ పంపుతాడు.

ఆ లింక్‌లోకి వెళ్లి OTP ద్వారా లాగిన్ అయ్యి వివరాలు చెక్ చేసి పేమెంట్ చేయండి.

FASTag అక్కడిక్కడే యాక్టివేట్ అవుతుంది.

ఆన్‌లైన్ FASTag – 3–4 రోజులు లో వస్తుంది, ఆఫ్‌లైన్ FASTag – రియల్ టైమ్‌లో యాక్టివేట్ అవుతుంది.

Tags:    

Similar News