coronavirus : 2 సంవత్సరాలు ప్రయాణించవద్దు.. బయటి ఫుడ్ తినకూడదంటూ..

దేశంలోని అగ్ర పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కరోనా శకానికి కొత్త మార్గదర్శకాలను విడుదల..

Update: 2020-09-10 12:23 GMT

దేశంలోని అగ్ర పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కరోనా శకానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 12 పాయింట్ల ఫేక్ మార్గదర్శకాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిలో 2 సంవత్సరాలు ఎవరూ ప్రయాణించకూడదని, 1 సంవత్సరం బయట ఆహారం తినకూడదని, శాఖాహారం మాత్రమే తినాలని, ఒంటిపై రుమాలు ఉంచుకోవద్దని అందులో పేర్కొంది.

నిజానికి ICMR వెబ్‌సైట్‌లో కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలను తనిఖీ చేస్తే.. గత ఒక నెలలో అలాంటి మార్గదర్శకాలు జారీ చేయబడలేదు. 2 సంవత్సరాలు విదేశాలకు వెళ్లవద్దని, బయట ఆహారం తినవద్దనేది.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన అన్‌లాక్ -4 మార్గదర్శకంలో లేదు. దీంతో ఇవి ఫేక్ మార్గదర్శకాలు అనే విషయం అర్ధమవుతుంది. అయితే ఇలాంటివి ఆకతాయిలో ఎవరో పోస్ట్ చేసి ఉంటారని.. వాటిని నమ్మి ఎవరూ మోసపోవద్దని పలువురు సోషల్ మీడియా పరిశీలకులు సూచిస్తున్నారు.  

Tags:    

Similar News