ఈపీఎఫ్‌ఓ నుంచి రూ. 3,601 కోట్ల ఉపసంహరణ

కరోనా కారణంగా అడ్వాన్సులను పూర్తిచేస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రకటించింది.

Update: 2020-04-23 04:51 GMT

కరోనా కారణంగా అడ్వాన్సులను పూర్తిచేస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రకటించింది.దాదాపు 90 శాతం ముందస్తు చెల్లింపులను కేవలం మూడు రోజుల్లోనే పూర్తిచేసింది. మొత్తం 10.02 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు బుధవారం తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావాన్ని అధిగమించడం కోసం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీలో భాగంగా ఈపీఎఫ్‌ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు ప్రభుత్వం వీలుకల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం రూ .3,601 కోట్ల పంపిణీ చేసినట్లు తెలిపింది.

ఇందులో రూ .1,954 కోట్ల కోవిడ్ క్లెయిమ్‌లు ఉన్నాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఉద్యోగులకు ఇది తోడ్పాటు కానుంది. కాగా కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందులో మొత్తం ఖాతానుంచి గరిష్టంగా 75 శాతం అడ్వాన్స్ ను ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం.


Tags:    

Similar News