Drone Strike: గుజరాత్‌ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

Drone Strike: ఇరానియన్ డ్రోన్ దాడి చేసినట్లు తెలిపిన అమెరికా రక్షణ వ్యవస్థ

Update: 2023-12-24 05:28 GMT

Drone Strike: గుజరాత్‌ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

Drone Strike: అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై జపాన్‌కు చెందిన కెమికల్‌ ట్యాంకర్‌పై నిన్న డ్రోన్‌ దాడి జరిగింది. ఈ డ్రోన్‌ దాడి ఇరాన్‌ పనేనని అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ పెంటగాన్‌ స్పష్టం చేసింది. దాడిని హౌతీ తిరుగుబాటుల పనిగా భావించారు. ఇటీవల కాలంలో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో అనేక నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా దాడి ఘటన ఇరాన్‌ పనేనని ధ్రువీకరించింది.

నిన్న ఉదయం 10 గంటలకు ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి జరిగింది. దాదాపు 21 మంది భారతీయులతో సహా ట్యాంకర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. డ్రోన్‌ దాడితో ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనలో పెద్ద నష్టమేమి జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి. ట్యాంకర్‌ భారత తీరానికి దాదాపు 200 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో దాడి జరిగింది. దాడి ఘటన తెలిసిన తర్వాత భారత నావికాదళం వెంటనే స్పందించింది. ట్యాంకర్‌ను రక్షించేందుకు ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ షిప్‌ ఐసీజీఎస్‌ను పంపింది. ఎంవీ కెమ్ ప్లూటో షిప్‌ లైబీరియన్‌ జెండా కింద పని చేస్తుందని పెంటగాన్‌ పేర్కొంది.

Tags:    

Similar News