అమ్మాయిలకు గేర్ రాడ్ ఇచ్చి.. బస్సు నడుపుతూ టిక్‌టాక్ చేసిన డ్రైవర్

Update: 2019-11-20 08:09 GMT
Image: Facebook/ Open Newser Wayanad News

టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. టిక్‌టాక్ కొందరిని స్టార్లను కూడా చేసింది టిక్‌టాక్.  చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది  టిక్‌టాక్ చేస్తున్నారు. అయితే టిక్‌టాక్ పిచ్చితో ప్రయాణికుల ప్రాణాలతోనే చెలగాటం ఆడాడు ఓ బస్సు డ్రైవర్. కేరళాకు చెందిన ఓ బస్సు డ్రైవర్ ఇద్దరు అమ్మాయిలతో కలిసి గేర్లు వేయిస్తూ బస్సు నడుపుతూ టిట్‌టాక్ చేశాడు.

కేరళ నుంచి గోవాకు విద్యార్థులతో కలిసి ప్రయాణిస్తున్న బస్సులో టిక్‌టాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విద్యార్ధులకు గేర్ రాడ్ ఇచ్చి డ్రైవర్ ఎం.షాజీ బస్సు నడుపుతున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో అతడి లైసెన్సు రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Full View 

Tags:    

Similar News