Donald Trump: ఈరోజు రాత్రి 9 గంటలకు చైనా అధ్యక్షుడితో మాట్లాడనున్న ట్రంప్

అత్యధిక కరోనావైరస్ కేసులున్న దేశాల జాబితాలో అమెరికా కూడా చేరిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2020-03-27 03:19 GMT
donald trump

అత్యధిక కరోనావైరస్ కేసులున్న దేశాల జాబితాలో అమెరికా కూడా చేరిపోయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే చైనాను అధిగమించినందున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడతారని చెప్పారు. శుక్రవారం రాత్రి 9:00 గంటలకు జితో మాట్లాడుతున్నట్లు ట్రంప్ విలేకరుల సమావేశంలో చెప్పారు. 82,404 సంక్రమణ కేసులతో, యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు వైరస్ హాట్‌స్పాట్‌ లైన చైనా మరియు ఇటలీని అధిగమించిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నడుపుతున్న ట్రాకర్ తెలిపింది. అయితే ట్రంప్ దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ, "చైనాలో సంఖ్యలు ఏమిటో మీకు తెలియదు" అని అన్నారు. జి గ్లోబల్ ప్రతినిధుల తో కలిసి మహమ్మారి గురించి చర్చిస్తానని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.

అమెరికా సైనికులు చైనాకు వైరస్ తెచ్చారని తద్వారా కుట్ర సిద్ధాంతానికి తెరలేపారని చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. "ఇది కేవలం చైనా నుండి మాత్రమే వచ్చింది," అని ఆయన గురువారం అండర్లైన్ చేసి మరి చెప్పారు, అయినప్పటికీ, చైనీయులు అలాగే భావిస్తే చేసేదేమి లేదని అన్నారు. ఇదిలావుంటే కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సామూహిక సామాజిక దూర వ్యూహాల ఫలితంగా ఏర్పడిన భారీ ఆర్థిక పతనంపై చర్చించడానికి జి ప్రతినిధులు సమావేశం అయ్యే అవకాశం ఉంది. వీరు కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపే అవకాశం ఉంది.


Tags:    

Similar News