కరోనావైరస్ నివారణకు హోం రెమెడీ.. ఫేకా.. ఒరిజినలా?

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో ఇప్పటివరకు 27,000 మంది మరణించారు.

Update: 2020-03-28 12:19 GMT
Home remedy

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో ఇప్పటివరకు 27,000 మంది మరణించారు.దాదాపు 6 లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వింత చికిత్సలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న తాజా హోం రెమెడీ.. కోవిడ్ -19 ను నివారించడానికి సముద్రపు ఉప్పునీరు మరియు నారింజ తొక్కలను వేడి చేసి ఆవిరిని పీల్చాలని సూచిస్తుంది.

ఓ ఫేస్బుక్ యూజర్.. సముద్రపు నీటిలో ఆరెంజ్ తొక్కలు వేడి చేసే వీడియోను పోస్ట్ చేసి 15 నిమిషాలు ఆవిరి పీల్చాలని సూచించారు.. అందువల్ల కరోనా వైరస్ శరీరంలోకి రాకుండా నిరోధిస్తుందని నేను చేశాను మీరు కూడా చేయండని పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.

అయితే ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ ఈ విధాన్నాన్ని తప్పుదోవ పట్టించేదిగా గుర్తించింది. కోవిడ్ -19 కి ఇంకా మందు కనిపెట్టలేదు మరియు సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేసిన వీడియోకు శాస్త్రీయ రుజువు లేదు. కరోనావైరస్ సంక్రమణను నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇంకా ఎటువంటి పరిష్కారాన్ని సిఫారసు చేయలేదు. అందువల్ల ఇలాంటి ప్రయోగాల వల్ల ఉపయోగం ఉండదని తేల్చింది.


Tags:    

Similar News