ఢిల్లీకి 9వ ర్యాంకు..మాస్కోకి అగ్రస్థానం

ప్రపంచంలో అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న ఖరీదైన నివాస విపణుల లిస్ట్ లో ఢిల్లీకి 9వ ర్యాంకు లభించింది.

Update: 2019-11-20 03:40 GMT
fastest growing prime residential market

ప్రపంచంలో అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న ఖరీదైన నివాస విపణుల లిస్ట్ లో ఢిల్లీకి 9వ ర్యాంకు లభించింది. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. 2019 మూడో త్రైమాసికానికి అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఈ జాబితాను రూపొందించింది. ప్రపంచంలోని వివిధ నగరాలకు ర్యాంకులు ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ఖరీదైన నివాస సముదాయల ధరల కదలికలను స్థానిక కరెన్సీతో లెక్కగట్టి నైట్‌ ఫ్రాంక్‌ ర్యాంకులు ఇచ్చింది. మాస్కోకి అగ్రస్థానం దక్కింది. ఫ్రాంక్‌ఫర్ట్‌ కు రెండో ర్యాంకు తైపీ మూడో ర్యాంకు పొందింది. సియోల్‌కు ఆఖరి ర్యాంకు లభించింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే దిల్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 9వ స్థానానికి ఎగబాకింది. హస్తినలోని పలు ప్రాంతాల్లో విలాసవంత గృహాల ధరలు మూడో త్రైమాసికంలో సగటున 4.4 శాతం మేర పెరిగాయి. బెంగళూరు ర్యాంకు 15 నుంచి 5 స్థానాలు తగ్గి 20కి దిగివచ్చింది. ముంబయి 30వ స్థానం నుంచి రెండు స్థానాలు పెంచుకొని 28వ స్థానంలో నిలిచింది. 

Tags:    

Similar News