మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌ సిన్హా అరెస్ట్

మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌ సిన్హాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2020-05-18 16:34 GMT
Former Union Minister Yashwant Sinha

మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌ సిన్హాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు యశ్వంత్‌ సిన్హాపై ఉన్నాయి. వలస కూలీలను స్వస్ధలాలకు పంపేందుకు వారికి సాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్‌ చేస్తూ యశ్వంత్‌ సిన్హా నిరసనకు దిగారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పలువురు వలస కూలీలు మృత్యువాతన పడ్డారని ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

ఈ క్రమంలో ధర్నా నిర్వహించినందుకు గాను ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా సమాచారం ఇచ్చారు. ఇదిలావుంటే తన డిమాండ్లను నెరవేర్చేవరకూ తాను ధర్నాను కొనసాగిస్తానని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. కాగా సుదీర్ఘకాలం యశ్వంత్ సిన్హా బీజేపీలో పనిచేశారు. ఓ దఫా కేంద్ర మంత్రి కూడా అయ్యారు.


Tags:    

Similar News