ప్రియంక హత్యపై ఢిల్లీలో ఆందోళనలు

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఉరి తీయాలంటూ స్థానికులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి.

Update: 2019-11-30 09:21 GMT
నిందితులను ఉరితియ్యాలంటూ దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలు

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఉరి తీయాలంటూ స్థానికులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. కాగా..దేశ రాజధాని ఢిల్లీలోనూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ స్ట్రీట్ లో యువత భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మళ్లి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాని కోరుతున్నారు.

ప్రస్తుతం ప్రియాంక హత్య కేసులో నిందితులు షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. అయితే నిందితులను తమకు అప్పగించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు హత్యాచార ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళా, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను ఉరితియ్యాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.


Tags:    

Similar News