Delhi Election Results: నేడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు

Update: 2025-02-08 00:59 GMT

Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, బిజెపి 27 ఏళ్ల తర్వాత అధికారం మాదే అంటోంది. ఈసారి కాంగ్రెస్ కూడా పూర్తి బలంతో ఎన్నికల్లో పోటీ చేసింది. గత ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లలో 62 సీట్లు గెలుచుకోగా, బిజెపి ఎనిమిది సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ తన ఖాతాను కూడా తెరవలేకపోయింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యం నేడు తేలిపోతుంది.  

మొత్తం 70స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 5న ఎన్నికల జరిగాయి. మొత్తం 60.42శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 699 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు ఈ సారి బీజేపీ గెలుస్తుందని వచ్చాయి. 27ఏళ్ల తర్వాత హస్తిన పీఠం ఢిల్లీకి దగ్గబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ముచ్చటగా మూడోసారి గెలుపు తమదే అంటోంది. హ్యాట్రిక్ కొట్టి తీరుతామని దీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంది. అయితే మరో కీలక పార్టీ కాంగ్రెస్ మాత్రం ఒకటి రెండు సీట్లకే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో కాంగ్రెస్ ఆశలు సన్నగిల్లాయి.

అసెంబ్లీ స్థానాలు 70.. మ్యాజిక్ మార్క్ 36. గత రెండు సార్లు ఆప్ కు మంచి మెజార్టీ వచ్చింది. అయితే ఈ సారి కొన్ని సీట్లు తగ్గినా..మెజార్టీ తగ్గకపోవచ్చనేది ఒక అంచనా అయితే. గట్టిగా పోటీ ఇచ్చి బీజేపీ 40కిపైగా సీట్లు సాధించి ఆప్ కి షాక్ ఇస్తునేది మరో అంచనా. మరి కోటిన్నర మంది జనాభా తీర్పు ఏంటో నేడు తేలిపోతుంది. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67సీట్లు గెలుచుకోగా..2020లో 62సీట్లు గెలిచుకుంది. బీజేపీ 1998 నుంచి ఢిల్లీలో అధికారంలో లేదు. 

Tags:    

Similar News