ఆ విషయం పాటిస్తే కరోనాపై యుద్ధంలో గెలస్తాం : కేజ్రీవాల్‌

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 979 పైగా నమోదయ్యాయి.

Update: 2020-03-29 15:54 GMT
Aravind Kejriwal (File Photo)

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 979 పైగా నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి 26 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా 50 మందికి పైగా ఈ వైరస్ బారినపడ్డారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వలస వచ్చిన కూలీలంతా వసతి శిబిరాల్లో ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూలీలకు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. క్రీడా మైదానాలు, పాఠశాలలు షెల్టర్లుగా కేటాయించినట్లు సీఎం వెల్లడించారు.

రాష్ట్రంలో నాలుగు లక్షల మంది వలస కూలీలకు వసతి, భోజనం అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడి వారు అక్కడే ఉండి స్వీయ నిర్బంధంలో ఉండాలని, ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ని విజయవంతం చేస్తే కరోనాపై చేస్తున్న పోరాటంలో గెలుస్తామని కేజ్రీవాల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News