ట్రంప్ నివాసం దగ్గర సీపీఐ నారాయణ నిరసన

Update: 2019-08-31 07:20 GMT

ఆయన సాక్షాత్తు అగ్రరాజ్య అధ్యక్షుడు.. తలుచుకుంటే ఏమైనా చేయగలరు.. అలాంటి నేతకు కూడా నిరసన సెగ అంటుకుంది. అది కూడా భారతీయ నాయకుడి ద్వారా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం వాషింగ్టన్‌ వైట్‌ హౌస్‌ దగ్గర జమ్మూ కశ్మీర్‌ అంశంపై నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. కశ్మీర్‌లో మారణకాండ ఆపాలని, యుద్ధం పరిష్కారం కాదని పలువురితో కలిసి నినాదాలు చేశారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. వైట్‌హౌస్‌కి వంద కిలోమీటర్ దూరంలో నిరసనలు తెలిపే అవకాశం ఉంది కానీ.. ఏపీ, తెలంగాణలో మాత్రం 10 కి.మీ. దూరంలో నిరసనలు తెలిపినా ప్రభుత్వాలు ఒప్పుకోవని ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు.  

Tags:    

Similar News