కరోనావైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. కోవిడ్ దాటికి అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. దేశాధినేతలు, రాజకీయ నేతలకు సైతం కరోనా సోకడంతో అన్ని కార్యక్రమాలూ రద్దవుతున్నాయి. కోవిడ్ కేసులు దేశంలో అధికారికంగా 81 నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి దాటికి 5వేల మందిపైగా మృత్యువాతపడ్డారు.
మరోవైపు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలి పోయాయి. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు చూడని నష్టాలను చవిచూశాయి. అయితే కరోనాకు మందు కనిపేట్టేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు నివరణకు దేశానికి చెందిన జైపూర్ వైద్యులు దీనికి ఉపశమనం కల్పించే మందులు కనుగొనట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా సోకిన ఇటాలియ్ పేషంట్ కు పలు రకాల మందుల ద్వారా నయం చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కరోనా వైరస్‌కు నివారణకు పలు కాంబినేషల్ lopinavir, ritonavir and Oseltamivir , అనే డ్రగ్ వాడుతున్నట్లు ఆంగ్ల మీడియా సీఎన్ఎన్ న్యూస్ 18తో చానల్ ఓ కథనంలో పేర్కొంది అలాగే కొన్ని కేసుల్లో ఎచ్1ఎన్1 వైరస్ కలిగిన స్వైన్ ఫ్లూ వాడే మందులు వాడుతున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఆ డ్రగ్ ఒక రోగిపైనే వాడినట్లు అది సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు ఎవరు పూర్తిగా దీనిపై పూర్తి స్థాయిలో ప్రకటించకపోవడంతో ఇది ఎంత వరకు వాస్తవం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచిచూడాల్సిందేే.