ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు వేలు దాటిన కరోనా కేసులు..

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా భారిన పడిన వారి సంఖ్య 4059 కు చేరుకుంది.

Update: 2020-05-16 06:27 GMT
Representational Image

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా భారిన పడిన వారి సంఖ్య 4059 కు చేరుకుంది. గత 24 గంటల్లో 159 కరోనా కేసులు బయటపడ్డాయి.. ఇది ఇప్పటివరకూ నమోదైన వాటిలో మూడవ అతిపెద్ద సంఖ్య. కొత్త కేసులు బల్లియా, హాపూర్‌లో పదేసి కేసులు నమోదు కాగా, ఖాజీపూర్‌లో 7, సిద్ధార్థ్‌నగర్‌లో 5, వారణాసిలో 2, కాన్పూర్‌లో 2, హమీర్‌పూర్, కన్నౌజ్, గోరఖ్‌పూర్‌లో ఒక్కొక్కటి చొప్పున నిర్ధారించారు. ఇక ఇప్పటివరకు 95 మంది మరణించిన వారిలో అత్యధిక సంఖ్యలో ఆగ్రాలో ఉన్నారు. దీని తర్వాత మీరట్‌లో 17 మంది మరణించారు. మొరాదాబాద్‌లో 10 మరణాలు సంభవించాయి.

కాన్పూర్ నగరంలో ఆరు మరణాలు సంభవించాయి. నోయిడా, మధుర, ఫిరోజాబాద్‌లో నాలుగు, అలీగర్ లో మూడు మరణాలు సంభవించాయి. ఝాన్సీ, ఘజియాబాద్ ,మెయిన్‌పురిలో రెండు మరణాలు ఉన్నాయి. లక్నో, అమ్రోహా, వారణాసి, బస్తీ, బులంద్‌షహర్, శ్రావస్తి, బరేలీ, కాన్పూర్ దేహాట్, బిజ్నోర్, ఎటా, ప్రయాగ్రాజ్, లలిత్‌పూర్, హాపూర్, సంతక్‌బీర్ నగర్, జలాన్, మహోబా మరియు ప్రతాప్‌గర్ లో ఒక్కొక్కరు ఒక్కో మరణం సంభవించింది.

Tags:    

Similar News