కరోనా కల్లోలం: ఇద్దరు ఏఎస్‌ఐలు మృతి
కరోనా కాటుకు మరో ఇద్దరు పోలీసులు బలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
కరోనా కాటుకు మరో ఇద్దరు పోలీసులు బలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ధారావిలోని షాహూనగర్ పోలీస్టేషన్‌లో ఏపీఐగా విధులు నిర్వహిస్తోన్న 32 ఏళ్ల అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎఎస్‌ఐ) గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతూ.. మరణించారు. అలాగే 57 ఏళ్ల మరో పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కిల్లర్ వైరల్‌తో మరణించారు.
ఈయన శనివారం తెల్లవారుజామున బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో సియోన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఆసుపత్రిలో మరణించిన ఏ వ్యక్తికైనా కరోనా టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీరి శాంపిల్స్‌ను ల్యాబ్ కు పంపగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన పోలీసుల సంఖ్య 21కు చేరుకుందని అధికారులు తెలిపారు.